Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌లో ఏపీ సహకార సంఘాల ఎన్నికలు!

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (11:21 IST)
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు(సింగిల్‌ విండోలకు) ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. 2013 జనవరి, ఫిబ్రవరి నెలల్లో సింగిల్‌విండోలకు ఎన్నికలు జరిగాయి.

వారి పదవీకాలం 2018 ఫిబ్రవరిలో పూర్తయింది. అప్పటి నుంచి 2019 జూలై తరువాత పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలు కొనసాగాయి. ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారడంతో సింగిల్‌విండోలకు అధికారులను పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించారు.

సహకార ఎన్నికల ప్రక్రియకు సుమారు 45 రోజులు వ్యవధి కావాల్సి వస్తుంది. సంఘాల్లో సభ్యుల వారీగా తొమ్మిది అంశాలతో కూడిన వివరాలను సహకార శాఖ అధికారులు సేకరిస్తున్నారు. విండోల్లో రూ.300 షేర్‌ ధనం కలిగినవారే ఓటు హక్కు కలిగి ఉంటారు.

రెవెన్యూ గ్రామాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల్లో పురుషులు, స్ర్తీల వారీగా ఓటర్ల జాబితా తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో జాబితా తయారు చేసి సహకార శాఖ కమిషనర్‌ కార్యాలయానికి పంపనున్నారు.

సంబంధిత వార్తలు

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments