Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపై రేపు వైసీపీ కార్యకర్తలు దాడి చేసినా ఆశ్చర్యం లేదు: సుంక‌ర ప‌ద్మ‌శ్రీ

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (16:43 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి జగన్ కంకణం కట్టుకున్నార‌ని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ కామెంట్స్ చేశారు. టిడిపి కేంద్ర కార్యాలయం, టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. 
 
ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయాలు, ఇళ్లపై దాడులు సరికాద‌ని, తమకు ఎదురు చెప్పేవారు ఉండకూడదని ముఖ్యమంత్రి దాడులకు సైతం వెనుకాడటం లేద‌ని ప‌ద్మ‌శ్రీ ఆరోపించారు. రాజకీయ పార్టీలు అన్న తరువాత ఎవరి పార్టీ సిద్దాంతాలు వారికి ఉంటాయని, ముఖ్యమంత్రి జగన్ పార్టీ సిద్దాంతం రౌడీయిజం అని ఆమె ఎద్దేవా చేశారు. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో టీడీపీ పార్టీ ఆఫీసులపై దాడి అంటే, ఉద్దేశపూర్వకంగా చేసింది కాక మరేంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. 
 
ఏపీ పోలీస్ శాఖ వైసీపీ పోలీస్ శాఖగా మారింద‌ని, అధికార పార్టీ అరాచకాలకు పోలీసులు కొమ్ము కాస్తున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. జరిగిన తప్పును తప్పు అని చెబుతున్న త‌న‌పై కూడా రేపు వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఆశ్చర్యం లేద‌ని సుంక‌ర ప‌ద్మ‌శ్రీ అన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల‌ని, టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇంటిపై దాడికి దిగిన నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాల‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్యాణ్‌రామ్‌ మెరుపు చిత్రం పాటలో పాల్గొన్న విజయశాంతి - తాజా అప్ డేట్

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పేజీలో అల్లు అర్జున్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

తర్వాతి కథనం
Show comments