దూసుకొస్తున్న మండూసు తుపాను.. జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (15:06 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. మాండూస్‌గా నామకరణం చేసిన ఈ తుపాను ప్రస్తుతం తీరం వైపు అమిత వేగంతో ప్రయాణిస్తుంది. ఇది శుక్రవారం అర్థరాత్రి పుదుచ్చేరి - శ్రీహరికోటల మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం చెన్నైకు 620 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
పైగా, ఈ తుపాను తీరందాటే సమయంలో గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల దూరంలో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ తుపాను కారణంగా ప్రకాశం, నెల్లరూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అన్నమయ్య, కడప జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేశారు. 
 
ఈ తుపాను తీరంవైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. ముందస్తు చర్యలతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికపుడు సమీక్షను నిర్వహిస్తూ, వాతావరణ శాఖ హెచ్చరికలు, సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ఆయన కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తుపాను పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments