Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు

Advertiesment
timesofindia award
, బుధవారం, 28 సెప్టెంబరు 2022 (09:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీ అగ్రభాగంలో నిలిచింది. దీంతో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ అవార్డును ప్రదానం చేసింది. పోర్టుల నిర్మాణంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంలో ఎంపికైనందుకు ఈ అవార్డును ప్రదానం చేసింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ అవార్డును అందుకున్నారు. 
 
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పోర్టులను నిర్మిస్తున్న కారణంగానే ఈ అవార్డుకు ఏపీ ఎంపికైంది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ఏపీలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ అవార్డుకు ఎంపిక చేసి ప్రదాన చేసింది. 
 
మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దీన్ని అందజేశారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, మారిటైం డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌లు ఈ అవార్డును అందుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క రోజులో రూ.57 వేల కోట్లు నష్టపోయిన అదానీ గ్రూపు