Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుకను మాఫియా తన్నుకెళ్తోంది.. ఏం చేద్దాం? మంత్రులతో సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (14:50 IST)
గత ప్రభుత్వం ఇసుక విధానం వల్ల ఇసుకను మాఫియా తన్నుకెళ్తోందనీ, అందువల్ల కొత్త ఇసుక విధానాన్ని తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంత్రులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేశారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
 
సమీక్ష అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం హాజరయ్యారు. 
 
గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన విధానం వల్ల ఆదాయం అంతా మాఫియా చేతుల్లోకి వెళ్తోందని జగన్ భావిస్తున్నారు. ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకే వచ్చేలా నూతన ఇసుక విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఇసుక విధానంపై ఇప్పటికే కొంత అధ్యయనం చేసిన మంత్రులు, అధికారులు ఈ సమీక్షలో జగన్‌కు వివరించారు. ఈ నేపధ్యంలో ఇసుక విధానంపై జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments