Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు జాతి మాణిక్యాలను సత్కరించడం నా అదృష్టం

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (15:39 IST)
తెలుగుజాతి మాణిక్యాలను సత్కరించడం దేవుడు త‌నకు ఇచ్చిన అదృష్టం అని ఏపీ సీఎం జ‌గ‌న్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైఎస్సార్‌ సాఫల్య, వైఎస్సార్‌ జీవన సాఫల్య పురస్కారాలను  విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన  కార్యక్రమంలో అందించారు. ఇందులో ముఖ్య అతిథిగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ పాల్గొన్నారు. మొత్తం 29 మందికి వైఎస్సార్‌ జీవన సాఫల్య, 30 మందికి వైఎస్‌ఆర్‌ సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు.
 
 
ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ, తెలుగు జాతిలో మాణిక్యాలను, మహానుభావులను సత్కరించడం దేవుడు త‌నకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రతిభకు పెద్దపీట వేసి, అత్యంత పారదర్శకంగా అవార్డుల ఎంపిక చేపట్టామ‌ని చెప్పారు. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారతరత్న, పద్మ అవార్డుల తరహాలో ఏపీలోనూ అత్యున్నత పౌర పురస్కారాలు ఇస్తున్నామని తెలిపారు. రైతులు, విద్యార్థులతో పాటు ప్రతి పేదవాడి కోసం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పనిచేశారని ఆయ‌న చెప్పారు.
 
 
అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున  ఈ పురస్కారాలను ప్రకటించినట్లు సీఎం వెల్లడించారు. అవార్డుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ నేపథ్యం చూడలేదని తెలిపారు. కేవలం మానవత, సేవ, ప్రతిభను గుర్తించి ఎంపిక చేశామని ఆయ‌న అన్నారు. వీధి నాటకం, తోలుబొమ్మలు, కూచిపూడి నృత్యంతో పాటు జానపద, సేవలు, వ్య‌వ‌సాయం వంటి రంగాల్లో కృషి చేసిన వారికి పురస్కారాలు ఇస్తున్నామని వివ‌రించారు.
 
 
భూమి మీద ఉంటూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన రాజశేఖరరెడ్డి పేరు మీద అవార్డులను ప్రదానం చేస్తుండ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌ని చెప్పారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఎంఎస్‌ఎన్‌ చారిటీస్ తో పాటు  సీపీ బ్రౌన్‌ లైబ్రరీకి, వేటపాలెం గ్రంథాలయానికి, ఆర్సీడీ సంస్థకి, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌కి కూడా అవార్డులు అందాయ‌ని తెలిపారు. అలాగే, కవులకు, పాత్రికేయులకు ఇస్తున్న‌ట్లు తెలిపారు. క‌రోనా స‌మయంలో ప్రాణాలు సైతం లెక్క చేయ‌కుండా  సేవలందించిన వారికీ అవార్డులు ఇచ్చామ‌న్నారు. ఈ అవార్డులన్నీ ప్రతి ఏడాది నవంబర్‌ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ప్రదానం చేస్తున్న‌ట్లు తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments