రాజధానితో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు : కేంద్రం అఫిడవిట్

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (12:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్రం ఓ స్పష్టతనిచ్చింది. రాజధాని ఏర్పాటు లేదా  రాజధానితో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 
 
మూడు రాజధానులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. రాష్ట్రాల రాజధానిపై నిర్ణయం తీసుకోవడం కేంద్ర పరిధిలోదా? లేక రాష్ట్ర పరిధిలోదా? అనే అంశంపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై కేంద్ర హోంశాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
 
రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని అఫిడవిట్‌లో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని తేల్చి చెప్పింది. 
 
ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉండదని పేర్కొంది. రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. మరోవైపు మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ హైకోర్టు 10 రోజుల పాటు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే. 
 
కాగా, ఇటీవల మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుతో పాటు.. సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే. దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో కేంద్రం తన వైఖరిని తేటతెల్లం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

Jonnalagadda: స్టార్ డమ్ కోరుకుంటే రాదు, ప్రేక్షకులు ఇవ్వాలి : చైతన్య జొన్నలగడ్డ

Manchu Manoj : మోహన రాగ మ్యూజిక్ తో మంచు మ‌నోజ్‌

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments