Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ప్రజలకు నరక చతుర్థశి, దీపావళి పండుగ శుభాకాంక్షలు- కోడెల

తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ విదేశాల్లో వున్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా స్పీకర్ అభివర్ణించారు. భారతీయ సంస్కృతికి

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (15:57 IST)
తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ విదేశాల్లో వున్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా స్పీకర్ అభివర్ణించారు. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తులు దీపావళి. జగతిని జాగృతం చేసే చెతైన్య దీప్తుల శోభావళి అని స్పీకర్ తెలిపారు.
 
చీకటిని తోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాలికల శోభతో వెలుగొందే గృహాలంకరణాలు, ఆనంద కోలాహలంతో వెల్లవిరిసే ఆబాలగోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్లు, ఈ దివ్య దీపావళి సోయగాలు అని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. 
 
ఈ పర్మదినం సందర్భంలో కనకదుర్గమ్మ, లక్ష్మీ మాత ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సిరిసంపదలు కలగాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిపథంలో ముందుండాలని వేడుకున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments