Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో మరో రెండు ఫీచర్లు.. ఏంటవి?

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో రెండు కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఒకటి లైవ్ లొకేషన్ షేరింగ్ కాగా, రెండోది ఫోన్ నంబర్ చేంజ్ నోటిఫికేషన్. లైవ్ లొకేషన్ షేరింగ్ సాయ

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (14:32 IST)
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో రెండు కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఒకటి లైవ్ లొకేషన్ షేరింగ్ కాగా, రెండోది ఫోన్ నంబర్ చేంజ్ నోటిఫికేషన్. లైవ్ లొకేషన్ షేరింగ్ సాయంతో వాట్సాప్ వినియోగ‌దారులు తాము ఉన్న స్థానాన్ని త‌మ స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌తో పంచుకోవ‌చ్చు. లొకేష‌న్ పంచుకునే స‌దుపాయం ఇప్పుడు కూడా వాట్సాప్‌లో ఉంది. కాక‌పోతే ఈ లైవ్ లొకేష‌న్ ద్వారా స్థానాన్ని మ‌రింత ఖచ్చితత్వంతో పంచుకోవ‌చ్చు. అంటే స‌రిగ్గా నిల్చున్న చోటును స్నేహితులకు పంపుకోవ‌చ్చు. 
 
అంతేకాకుండా టైమ‌ర్ సెట్ చేసుకునే అవ‌కాశం కూడా ఉండ‌నుంది. దీని వ‌ల్ల మ‌న లొకేష‌న్‌ను ఎంత‌సేపు పంచుకోవాలో నిర్ణ‌యించుకోవ‌చ్చు. ఈ స‌దుపాయం వ‌ల్ల పిల్ల‌లు, మ‌హిళ‌ల‌కు మ‌రింత ఉప‌యోగం చేకూర‌నుంది. లొకేష‌న్ పంచుకోవ‌డంతో పాటు, ఎంత‌సేపు అదే స్థానంలో ఉండ‌బోతున్నారో కూడా తెలియ‌జేసే వీలుంది. ఈ వారం అప్‌డేట్‌తో ఈ స‌దుపాయం అందుబాటులోకి రానుంది. 
 
ఇక రెండో ఫీచర్ ఏంటంటే... యూజర్లు మొబైల్ నంబర్లు చేంజ్ చేసినప్పుడల్లా ఆ విషయాన్ని తెలియజేస్తూ కొత్త మొబైల్ నంబర్‌ను వేరే మార్గాల్లో ఇతరులకు చెప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా ఇబ్బంది లేదు. వాట్సాప్‌లో రానున్న ఫోన్ నంబర్ చేంజ్ నోటిఫికేషన్ ద్వారా యూజర్లు చేంజ్ అయిన తమ మొబైల్ నంబర్ గురించిన నోటిఫికేషన్‌ను అవతలి యూజర్‌కు పంపవచ్చు. 
 
దీంతో అవతలి వ్యక్తులకు ఆ సందేశం చేరుతుంది. ఫలానా యూజర్ మొబైల్ నంబర్ చేంజ్ చేశాడని వారికి తెలుస్తుంది. త్వరలోనే ఈ రెండు ఫీచర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు లభ్యం కానున్నాయి. ఇక దీంతోపాటు త్వరలో అందించనున్న అప్‌డేట్ ద్వారా వాట్సాప్ యాప్ సైజ్‌ను కూడా భారీగా తగ్గించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments