Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొత్త స్పీకర్ ఎన్నిక కూడా..

వరుణ్
మంగళవారం, 18 జూన్ 2024 (09:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఇవి 26వ తేదీ వరకు అంటే మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో అసెంబ్లీకి కొత్త స్పీకర్ ఎన్నికతో పాటు శాసనసభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఏపీ నూతన అసెంబ్లీ తొలి సమావేశాలు 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 24వ ప్రారంభమై 26వ తేదీతో ముగుస్తాయి. 
 
ఇందులో రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినందున ఈ నెల 24వ ప్రారంభమయ్యే సమావేశాల్లో తొలుత ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఆయన నూతనగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నిజానికి ఈ సమావేశాలను ఈ నెల 19వ తేదీనే నిర్వహించాల్సి వుంది. కానీ, గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సెలవుల్లో ఉండటంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. 
 
ఈ నెల 24వ తేదీన ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత కొత్త ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ పిమ్మట కొత్త స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఎన్నుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు, డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన పార్టీకి ఇస్తారనే ప్రచారం సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments