Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంలో ఏపీ పిటిషన్

Webdunia
గురువారం, 2 జులై 2020 (17:11 IST)
ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ స్టే ఇవ్వాలని కోరింది. అయితే దీనిపై జులై 6వ తేదీ తర్వాత విచారణకు వచ్చే అవకాశముంది.

మరోవైపు ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పటికే కేవియట్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 8న ఏపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. నిఘా పరికరాలకు సంబంధించిన కాంట్రాక్ట్‌లో అవకతవకలకు పాల్పడ్డారంటూ సస్పెండ్ చేసింది.

ఆ సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. అందులో ఆయనకు చుక్కెదురైంది. 
అయితే క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

న్యాయస్థానం వెంకటేశ్వరరావుకు ఊరట కలిగించే విధంగా తీర్పు ఇచ్చింది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మే 22న తీర్పు ఇచ్చింది. దీనిపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments