Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఏపీలో ఇంగ్లీషులోనే డిగ్రీ కోర్సులు - జగన్ సర్కారు ఆదేశం

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (17:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, ఇకపై డిగ్రీ కోర్సులను ఇంగ్లీషులోనే మొదలుపెట్టాలని నిర్ణయించింది. 
 
తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నత విద్యామండలి తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇకపై రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులన్నీ కూడా ఇంగ్లీష్ మాధ్యమంలోనే అమలు కానున్నాయి.
 
'ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలు డిగ్రీ కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోనే అందించాలని.. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కాలేజీలు తెలుగులో అమలు చేస్తున్న కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకోవాలని' ఉన్నత విద్యామండలి సూచించింది. ఇవి కొత్త విద్యా సంవత్సరమైన 2021-22 నుంచే వర్తిస్తాయని తెలిపింది.
 
లాంగ్వేజ్ కోర్సులు మినహాయించి.. మిగిలిన విభాగాల కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకునేందుకు ఈ నెల 18 నుంచి 28లోగా ప్రతిపాదనలు పంపాలని సూచించింది. గడువులోపు సమర్పించకపోతే.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా కోర్సుల నిర్వహణకు అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. 
 
కాగా, కొత్త విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా ఇంగ్లీష్‌ మీడియంలోనే కోర్సులను అందించాలని ఫిబ్రవరి 12వ తేదీన సీఎం వైఎస్ జగన్ ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments