Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్యీలు... ఆమోదం తెలిపిన గవర్నర్

Advertiesment
గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్యీలు... ఆమోదం తెలిపిన గవర్నర్
, మంగళవారం, 15 జూన్ 2021 (07:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలికి మరో నలుగురు ఎమ్మెల్సీలు కొత్తగా నియమితులయ్యారు. వీరంతా గవర్నర్ కోటాలో ఎంపిక చేశారు. గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీల కోటాలో శాసనమండలికి నామినేట్ అయినవారిలో లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్ యాదవ్, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజులు ఉన్నారు. 
 
ఏపీలో 4 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు సంబంధించిన ఫైలుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం సతీసమేతంగా రాజ్ భవన్‌కు తరలి వెళ్లి, గవర్నర్‌తో ఎమ్మెల్సీల అంశం చర్చించారు.
 
ప్రభుత్వం అంతకుముందే నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేయగా, ఫైలును ఆయన పెండింగులో ఉంచినట్టు తెలిసింది. సీఎం జగన్‌తో భేటీకి కొద్ది ముందుగా గవర్నర్ ఆ ఫైలుకు ఆమోదం తెలుపగా, గవర్నర్‌తో భేటీ అయిన సీఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ ఆమోదించినట్టు రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియోనీ తన కొత్త స్మార్ట్ వాచ్‌.. గుండె వేగాన్ని కొలవగలదు..