Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియోనీ తన కొత్త స్మార్ట్ వాచ్‌.. గుండె వేగాన్ని కొలవగలదు..

Advertiesment
జియోనీ తన కొత్త స్మార్ట్ వాచ్‌.. గుండె వేగాన్ని కొలవగలదు..
, సోమవారం, 14 జూన్ 2021 (21:47 IST)
Gionee StylFit GSW6
జియోనీ తన కొత్త స్మార్ట్ వాచ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అదే జియోనీ స్టైల్‌ఫిట్ జీఎస్‌డబ్ల్యూ7. ఇందులో గుండ్రటి డయల్‌ను అందించారు. ఐపీ67 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. బ్లూటూత్ వీ4.0 టెక్నాలజీని ఇందులో అందించారు. 
 
ఈ వాచ్‌లో రిమోట్ కెమెరా అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా వాచ్ నుంచే కనెక్ట్ చేసిన ఫోన్‌లో ఫొటోలు తీయవచ్చు. ఐపీ67 ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇది వాటర్ రెసిస్టెన్స్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. కేవలం రెండు గంటల్లోనే ఈ వాచ్ పూర్తిగా చార్జ్ కానుంది. దీని ధరను మనదేశంలో రూ.2,099గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన సేల్ కూడా మనదేశంలో ప్రారంభం అయింది. 
 
ఈ వాచ్‌పై ఒక సంవత్సరం, స్ట్రాప్‌పై ఆరు నెలల వారంటీని అందించనున్నారు. బ్లాక్, గ్రీన్, పింక్ కలర్లలో ఈ వాచ్ కొనుగోలు చేయవచ్చు.ఇందులో 1.3 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్సీడీ టచ్ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 240 x 240 పిక్సెల్స్‌గా ఉంది. 
 
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్ 4.0 కనెక్టివిటీ ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 5.1, ఐవోఎస్ 9.0 ఆ పైబడిన ఆపరేటింగ్ సిస్టంలను ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులో 24 గంటల రియల్ టైం హార్ట్ రేట్ మానిటర్‌ను అందించారు.
 
ఇది గుండె కొట్టుకునే వేగాన్ని కొలవగలదు. వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్, స్కిప్పింగ్ వంటి ఇతర స్పోర్ట్స్ మోడ్స్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఇందులో ఉంది. దీని ద్వారా శరీరంలో ఎస్‌పీఓ2 స్థాయిని తెలుసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇళ్లన్నీ కేంద్రం కడితే మీరేం చేస్తారు? సిఎం జగన్‌ను ప్రశ్నించిన సోము వీర్రాజు