Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటక ప్రాంతాల్లో మరో 300 వైన్ షాపులు, ఇదేనా మ‌ద్య‌నిషేధం?

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (12:02 IST)
జగన్ రెడ్డి చెప్పిన మద్యపాన నిషేదం హామీ ఏమైంది? మద్యం షాపులు పెంచట‌మేనా మద్యపాన నిషేధ‌మా? అని ఏపీ టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌శ్నించారు.

ఉన్న మద్యం షాపులు చాలవన్నట్లుగా పట్టణాలు, పర్యాటక ప్రాంతాల్లో మరో  300 షాపులు ఏర్పాటు చేయటం ప్రజలను మోసం చేయటమే అన్నారు. గ్రామాల్లో మద్యం షాపు లేని బజారు ఉందా? మద్యాన్ని ఏరులై పారిస్తూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారు... జగన్ రెడ్డి తన కమిషన్ల కోసం  నాసిరకం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల  ప్రాణాలతో చెలగాటమాడుతున్నార‌ని విమ‌ర్శించారు. 
 
మద్యంపై వచ్చే ఆదాయం చూపి ఏపీ అభివృద్ది కార్పోరేషన్ ద్వారా  రూ. 25 వేల కోట్లు అప్పు తెచ్చార‌ని, అప్పులు తెచ్చి అవి తీర్చలేక మద్యం రేట్లు పెంచి మందుబాబుల రక్తంతో, వారి కుటుంబాల కన్నీళ్లతో ఆ అప్పులు తీర్చాలని చూస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. మద్యం ఆదాయం మత్తులో మునిగిన వైసీపీ ప్రభుత్వానికి మహిళలు మత్తు వదిలించటం ఖాయమ‌ని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments