Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుత్తిలో ఈవీఎంను నేలకేసి కొడితే? పవన్ కల్యాణ్ (Video)

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (11:41 IST)
ఏపీలో ఈవీఎంలు మొరాయించాయని ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా బాబు బాటలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈవీఎంలు పనిచేయట్లేదని ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 10 శాతానికి పైగా ఈవీఎంలు పనిచేయడం లేదన్నారు.


అవి ఎందుకు పనిచేయడం లేదో తమకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఓ పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి పడుతున్నట్లు తమకు రిపోర్టులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని ఎలక్షన్ కమిషన్, కమిషనర్‌ను కోరారు.
 
మరోవైపు అనంతపురం జిల్లా గుత్తిలో ఏర్పాటుచేసిన ఈవీఎంను గురువారం జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా నేలకేసి కొట్టిన సంగతి తెలిసిందే. పోలింగ్ కంపార్ట్ మెంట్‌లో నియోజకవర్గం పేరును సరిగ్గా రాయలేదని ఆగ్రహం వ్యక్తంచేసిన గుప్తా, పోలింగ్ కేంద్రంలో ఇతర పార్టీల ఏజెంట్లతో గొడవ పడ్డారు. ఈ సందర్భంగా ఈవీఎంను నేలకేసి కొట్టడంతో అది పనిచేయకుండా పోయింది. 
 
దీంతో పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా విజయవాడలో పవన్ కల్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో మీడియా ఈ వ్యవహారంపై ఆయన్ను ప్రశ్నించింది.
 
దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ గుత్తిలోని బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 183వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగినట్లు తాను మీడియాలో చూశానని తెలిపారు. వాస్తవాలేంటో తెలుసుకుని మాట్లాడుతానని పవన్ చెప్పారు. చూడండి ఆయన మాటల్లోనే...
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments