Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీకి జగనన్న సీఎం కావడం ఖాయం-షర్మిల.. ఆ రథం ఢీకొని?

ఏపీకి జగనన్న సీఎం కావడం ఖాయం-షర్మిల.. ఆ రథం ఢీకొని?
, గురువారం, 11 ఏప్రియల్ 2019 (09:56 IST)
ఏపీకి జగనన్న సీఎం కావడం ఖాయమని వైసీపీ మహిళా నేత షర్మిల జోస్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీకి 140 సీట్లు ఖచ్చితంగా వస్తాయని జగన్ సోదరి షర్మిల్ అన్నారు. ఖచ్చితంగా జగన్ సీఎం అవ్వడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గురువారం తన ఓటు హక్కును వినియోగించిన సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. త్వరలో రాజన్న రాజ్యం రాబోతుందని ఆకాంక్షించారు. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 140 సీట్లు రానున్నాయని తాను అనుకుంటున్నానని అన్నారు. ప్రజలంతా జగన్ ప్రత్యేక హోదా కోసం ఎంతగా పోరాడారో చూశారని, ఇంకోవైపు చంద్రబాబు బీజేపీతో కలిసి, చేతులారా రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారో చూశారని అన్నారు. ప్రజలు అలసిపోయివున్నారని, మార్పును కోరుకుంటున్నారని షర్మిల చెప్పుకొచ్చారు. 
 
తాను ఎక్కువ చెప్పడం సబబుకాదని, తనకు దేవుడిపై నమ్మకం ఉందని అన్నారు. ప్రతి జిల్లాలోనూ జగన్ యువభేరి సభలను నిర్వహించారని, వాటితో యువతలో ఎంతో చైతన్యం వచ్చిందని అన్నారు. యువత నేడు తీర్పును ఇవ్వబోతున్నారని షర్మిల తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. జగన్‌ సోదరి షర్మిల ఎన్నికల ప్రచార రథం ఓ లారీని ఢీకొంది. ఈ  ఘటనలో ఒకరు మరణించగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామం వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. 
 
షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని విజయవాడ నుంచి పులివెందులకు వెళ్తున్న ప్రచార రథం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ నగిరి సంజీవనాయుడు (52) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హమ్మయ్య.. రియన్నా ఓటు హక్కును వినియోగించుకుంది..