సైకిల్ గుర్తుకు ఓటేస్తే... ఫ్యాను లాగేస్తోంది : చంద్రబాబు

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (11:10 IST)
సార్వత్రిక ఎన్నికల తొలి దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనేక ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతానికి పైగా ఈవీఎంలు పని చేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. 
 
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలను తాము అంగీకరించబోమని, రాష్ట్రంలోని 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదన్నారు. ఇపుడే నాలుగు గంటల సమయం వృథా అయిన కారణంగా ఈవీఎంలు పనిచేయని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఎన్నికల కమిషనరు ద్వివేదీకి లేఖ రాశారు. 
 
ఈవీఎంల పనితీరుపై రాష్ట్రమంతటి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే అది వైసీపీకి వెళుతున్నట్టు తెలుస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అన్ని పోలింగ్ బూత్‌లలో ఓటర్లు మొత్తం వచ్చి ఓటేసేంత సమయం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓటర్లు ఆందోళన చేస్తున్నా అధికారులు ఎవరూ స్పందించడం లేదని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments