Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'తాతామనవళ్ళ సరదా' : పోలింగ్‌కు ముందు రోజు చంద్రబాబు - దేవాన్ష్ ఆటలు

Advertiesment
'తాతామనవళ్ళ సరదా' : పోలింగ్‌కు ముందు రోజు చంద్రబాబు - దేవాన్ష్ ఆటలు
, గురువారం, 11 ఏప్రియల్ 2019 (08:03 IST)
ఒక వైపు సార్వత్రిక ఎన్నికల వేడి. మరోవైపు.. టీడీపీ అధినేతగా ప్రచార బాధ్యతలు. ఇలా గత నెలన్నర రోజులుగా క్షణం తీరిక లేకుండా గడిపిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ఒక రోజు ముందు తన మనవడు నారా దేవాన్ష్‌తో కలిసి సరదాగా గడిపారు. 
 
ఎన్నికల ప్రచారం ముగియడంతో మనవడు దేవాన్ష్‌తో బుధవారం కాసేపు ఉత్సాహంగా గడిపారు. తాతా మనవళ్లు ఇద్దరూ నవ్వులు చిందిస్తూ ఇంటి ఆవరణలోని గార్డెన్‌లో సరదాగా పరుగులు తీస్తున్న ఓ ఫొటోను మంత్రి నారా లోకేశ్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. 'ప్రజా విజయం కోసం అనుక్షణం ప్రజలతో మమేకమై, విరామం లేకుండా 110 ప్రచారసభల్లో పాల్గొన్న చంద్రబాబుగారికి కుటుంబంతో గడిపేందుకు కాస్త తీరిక దొరికింది. 
 
ఇదిగో ఇలా తాతా మనవళ్లు ఇద్దరూ సరదా సమయాన్ని గడుపుతున్నారు' అంటూ నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆ ఫోటోను షేర్ చేసి కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యంగా, టీడీపీ శ్రేణులు ఈ ఫోటోను షేర్ చేస్తూ తెగ సంతోషపడిపోతున్నారు. కాగా, ఎన్నికల్లో విజయం కోసం చంద్రబాబు అలుపెరగకుండా ప్రచారం చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనగామ సమ్మక్క ఆలయంలో నరబలి...