Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఐటీ మద్రాస్ నివేదిక ఇచ్చింది వైఎస్ మేనత్త కొడుకా?

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (12:54 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఏమాత్రం అనువైనది కాదనీ, ఇక్కడ నిర్మాణం చేపట్టాలంటే భారీ వ్యయం అవుతుందంటూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు పదేపదే ప్రచారం చేసింది. మంత్రులు కూడా ఈ విషయాన్ని పదేపదే చెబుతూ వచ్చారు. అలాగే, అమరావతి అంశంపై వైకాపా సర్కారు ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూపులు వేర్వేరుగా నివేదికలు ఇచ్చాయి. 
 
ముఖ్యంగా, అమరావతి మట్టి భారీ నిర్మాణాలకు అనుకూలంగా లేదని ఐఐటీ మద్రాస్ ఓ నివేదిక ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ నివేదికను కూడా బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూపు సమర్పించిన నివేదికలో కూడా పొందుపరిచింది. అయితే, ఈ నివేదికలన్నీ వైఎస్ బంధువులే ఇచ్చినట్టు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. 
 
దేశంలోఉన్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటై ఐఐటీ మద్రాస్ ఓ నివేదిక ఇచ్చిందని ప్రచారం జరిగింది. ఇదికూడా వైఎస్ మేనత్త కుమారుడైన పీటర్ ఇచ్చినట్టు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంమీద అమరావతి రాజధాని మార్పుపై ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలన్నీ వైఎస్ బంధులు లేదా ఆయన సన్నిహితులే ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. 
 
మొత్తంమీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి అనేది లేకుండా చేయడానికి, ఒక వ్యక్తిపై ఉన్న కక్షతో ఈ తరహా వ్యవహరిస్తున్నారంటూ విపత్రక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో జగన్ సర్కారు ఇపుడు మరో కొత్త వివాదంలో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments