Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన : రానున్న 3 రోజుల్లో...

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (16:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళాఖాతంలో, దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఏర్పడిందని తెలిపింది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వలన రాగల 24 గంటలలో ఒక అల్పపీడనం దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. 
 
దీంతోపాటు ఉపరితల ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడినట్లు తెలిపింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్లు వెల్లడించింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచనలు చేసింది.
 
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. అలాగే, దక్షిణ కోస్తాంధ్రలో బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. గురువారం దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. 
 
రాయలసీమ ప్రాంతంలో బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. గురువారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అలసట వల్లే విశాల్‌ స్పృహతప్పి కిందపడిపోయారు : వీఎఫ్ఎఫ్ స్పష్టీకరణ (Video

ఫ్రై డే మూవీలో అమ్మ పాటను ప్రశంసించిన మినిస్టర్ వంగలపూడి అనిత

Vishal helth: హీరో విశాల్ ఆరోగ్యంపై విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ వివరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments