ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు.. బీరాపేరులో పడిన ఆటో

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. ముఖ్యంగా, నెల్లూరు జిల్లాల్లో ఓ ఆటో వాగులోపడింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ఐదుగురు గల్లంతయ్యారు. ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. అలాగే, విజయనగేరం జిల్లాలో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 22 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. 
 
నెల్లూరు జిల్లా ఆత్మకూరు జ్యోతినగర్‌కు చెందిన కె.నాగభూషణం కుటుంబం సభ్యులు సంగంలోని సంగమేశ్వరాలయంలో నిద్ర చేసేందుకు ఆటోలో బయలుదేరారు. ఈ ఆటో బీరాపేరు వాగు వంతెనపై వెళుతుండగా, ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఒక్కదాన్నొకటి ఓవర్ టేక్ చేసే క్రామంలో ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. 
 
ఆ ఆటో వాగులోకి పడిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అదించారు. వారు వచ్చి ఆటోలో ఉన్న 12 మందిని రక్షించారు. వీరిలో ఐదుగురు గల్లంతయ్యారు. ఓ బాలిక మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
అలాగే, విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలవలస వద్ద జరిగిన మరో ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే, చింతాడవలసకు చెందిన 35 మది ట్రాక్టర్‌లో కిండాం అగ్రహారంలో జరిగిన వివాహానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చామలవలస వద్ద వీరి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందిని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments