ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోయింది. గత 24 గంటల్లో మొత్తం 31,957 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 181 మందికి పాజిటివ్ అని తేలింది. ఇదే సమయంలో 176 మంది నుంచి కోలుకున్నారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా వైరస్ బారినపడిన ఒక్కొక్కరు ప్రాణాలు విడిచారు. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో 2,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్సలు పొందుతున్నారు.
గత 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20,74,217కి చేరుకుంది. అలాగే, ఇప్పటివరకు 20,57,749 మంది కోలుకున్నారు. 14,457 మంది ప్రాణాలు కోల్పోయారు.