Webdunia - Bharat's app for daily news and videos

Install App

టంగుటూరులో విషాదం - ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (11:53 IST)
ప్రకాశం జిల్లా టంగుటూరులో విషాదం జరిగింది. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. సోమవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
టంగుటూరు మండలంలోని ఎం.నిడమానూరుకు చెందిన ముగ్గురు విద్యార్థులు మూసీ నదిలో ఈతకు వెళ్లారు. అయితే, ముగ్గురు విగతజీవులుగా మారారు. మృతులను వాసు (15), జగన్ (12), మహేష్ (13)లుగా గుర్తించారు. వీరంతా నిడమానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. 
 
ఆదివారం సెలవురోజు కావడంతో మధ్యాహ్నం సమయంలో క్రికెట్ ఆడేందుకు పొందూరు పంచాయతీ పొదవారిపాళెం సమీపంలోవున్న మూసీ నది వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ముగ్గురు విద్యార్థులు నదిలో స్నానం చేసేందుకు దిగారు. అంతే ఆ ముగ్గురు నీటిలో కొట్టుకునిపోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలించగా, సోమవారం ఉదయం మొదట రెండు మృతదేహాలను గుర్తించారు. ఆ తర్వాత మరో మృతదేహం కూడా లభ్యమైనట్టు పోలీసులు వెల్లడించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments