Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్: ఆర్థికాభివృద్ధిలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (17:03 IST)
ఆర్థికాభివృద్ధిలో ఏపీ రికార్డ్ సాధించింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఏపీ మరోమారు అదరగొట్టింది. 2020 - 2021 సంవత్సరంలో పలు విభాగాల్లో ప్రగతికి సంబంధించి నీతి ఆయోగ్ జాతీయ ర్యాంకులు ప్రకటించింది. అందులో ఏపీకి విశిష్ట గుర్తింపు లభించింది.

క్లీన్ ఎనర్జీ విభాగంలో ఏపీ మిగిలిన రాష్ట్రాలను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్ సాధించింది. మరో కీలక విభాగంలోనూ ఏపీ ఆశాజనకమైన స్థానంలో నిలిచింది.
 
రాష్ట్రాల స్థిర ఆర్థికాభివృద్ధిలోనూ ఏపీ మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆర్థికంగా స్థిరమైన అభివృద్ధి చాటిన టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విభాగంలో ఏపీ జాతీయస్థాయిలో మూడో స్థానం సాధించింది. ఈ జాబితాలో కేరళ తొలిస్థానంలో నిలవగా.. రెండో స్థానంలో హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. 
 
సిక్కిం, మహారాష్ట్ర ఏపీ తరువాత 4,5 స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ జాబితాలో బిహార్, అస్సాం, ఝార్ఖండ్ రాష్ట్రాలు చివరి స్థానంలో నిలిచాయి. బిహార్‌లో బీజేపీ మిత్రపక్షం జేడీయూ, అసోంలో బీజేపీ అధికారంలో ఉండడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments