Webdunia - Bharat's app for daily news and videos

Install App

2023 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ఇవే...

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (08:43 IST)
వచ్చే యేడాది 2023 సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు క్యాలెండర్‌ను ఏపీ సర్కారు గురువారం వెల్లడించింది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది. 
 
రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాడ్ ఉన్ నబీ వంటి పండుగలతో పాటు తిథులను బట్టి వచ్చే హిందూ పండుగల్లో మార్పులు ఉంటాయని పేర్కొంది. వాటిని ముందుగానే పత్రికా ప్రకటన, మీడియా ద్వారా తెలియజేస్తామని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
 
అలాగే, ఉగాది, శ్రీరామనవమి, వినాయకచవితి పండుగల సమయాల్లో బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాతాధికులు అనుమతితో ఐచ్ఛిక సెలవులను పొందేందుకు వీలు కల్పించింది. ఇక వచ్చే యేడాది మూడు సాధారణ సెలవులు, సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారం వచ్చాయి. ఒకటో తేదీ శనివారం వచ్చింది.
 
అయితే, ఉగాది, శ్రీరామ నవమి, వినాయకచవితి వంటి హిందూ పండుగలకు సెలవులు లేకపోవడంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ముఖ్యమైన హిందూ పండుగలకు సెలవులు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం మూడేళ్లుగా ఇదే విధంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణం ఈ మూడు పండుగలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments