Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలల దినోత్సవం 2022: వండర్‌లా హాలీడేస్‌తో మీలోని చిన్నారిని బయటకు తీసుకురండి

Advertiesment
image
, బుధవారం, 9 నవంబరు 2022 (23:41 IST)
భారతదేశంలో అతిపెద్ద ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌, వండర్‌లా ప్రత్యేక ఆఫర్లను బాలల దినోత్సవం కోసం తీసుకువచ్చింది. దీనిలో భాగంగా టీనేజర్లు,  యువత లేదంటే పెద్ద వయసు వ్యక్తులు వండర్‌లా పార్క్‌లకు చిన్న పిల్లల్లా డ్రెస్‌ చేసుకుని రావడంతో పాటుగా చైల్డ్‌ టిక్కెట్స్‌తో పార్క్‌లో వినోదం ఆస్వాదించవచ్చు. ఈ ఆఫర్‌ నవంబర్‌ 12 నుంచి 14 నవంబర్‌ 2022 వరకూ అందుబాటులో ఉంటుంది. సందర్శకులు చైల్డ్‌ టిక్కెట్‌ అర్హత సాధించాలంటే వారు స్కూల్‌ యూనిఫార్మ్స్‌ ధరించడంతో పాటుగా స్కూల్‌/కిడ్స్‌ ప్రోపర్టీలైన వాటర్‌ బాటిల్స్‌, స్కూల్‌ బ్యాగ్‌ (పాత శైలి), లాలీపాప్‌ క్యాండీ మొదలైనవి వెంట తీసుకురావాలి. ఈ ఆఫర్‌ బెంగళూరు, కొచి, హైదరాబాద్‌ వండర్‌లా పార్క్‌ల వద్ద అందుబాటులో ఉంటుంది.
 
‘‘మాకు చిన్నారులు అత్యంత ప్రత్యేకం. ఈ కారణం చేతనే తమలో దాచుకున్న చిన్నారిని సంతృప్తి పరచాలనే పెద్దల కోసం ఈ ప్రత్యేక ఆఫర్‌ తీసుకువచ్చాము. ఈ కార్యక్రమం ద్వారా పెద్ద వయసు  వ్యక్తులు సైతం ముందుకు వచ్చి తమలోని చిన్నారిని వేడుక చేయమంటున్నాము. అందుకు ప్రోత్సాహకంగానే రాయితీ ధరలలో టిక్కెట్లను అందిస్తున్నాము’’ అని శ్రీ అరుణ్‌ కె చిట్టిలాపిల్లి, మేనేజింగ్‌ డైరెక్టర్‌, వండర్‌లా హాలీడేస్‌ అన్నారు.
 
చిన్నారుల్లా వస్త్రధారణ చేసిన పెద్దలు ఖచ్చితంగా పార్క్‌ ఎంట్రెన్స్‌ వద్దనున్న యాక్టివిటీ జోన్‌ వద్ద హాజరవ్వాలి. అక్కడ పార్క్‌ సిబ్బంది ధృవీకరిస్తారు. ఈ తనిఖీ తరువాత మొదటి 1000 మంది అభ్యర్ధులకు రాయితీ ఓచర్లను అందిస్తారు. వారు ఓచర్‌ను టిక్కెట్‌ కౌంటర్‌ వద్ద అందించడం ద్వారా చైల్డ్‌ టిక్కెట్లను పొందవచ్చు.
 
బాలల దినోత్సవం పురస్కరించుకుని వండర్‌లా ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహించబోతుంది. వీటిలో డ్రాయింగ్‌, సలాడ్‌ డ్రెస్సింగ్‌, టాలెంట్‌ షో- సింగింగ్‌, స్టోరీ టెల్లింగ్‌ మొదలైనవి ఉంటాయి. విజేతలకు బహుమతులు కూడా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ పోటీలకు అవసరమైన సామాగ్రి  మొత్తం వండర్‌లా అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రీసర్వేలో నాణ్యత కోసం సాంకేతిక కసరత్తు: సిద్ధార్థ జైన్