Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం... మంత్రి యనమల

అమరావతి: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు సచివాలయం 2వ బ్లాక్ లోని తన చాంబర్‌లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ఉదయం నిర్వహించిన తమ శాఖ సమీక్షలో స్పష్టమైంది. ఎఫ్ఆర్ బీఎం(ఫిస్కల్ రెస్పాన్సబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్) చట్టం

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (17:23 IST)
అమరావతి: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు సచివాలయం 2వ బ్లాక్ లోని తన చాంబర్‌లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ఉదయం నిర్వహించిన  తమ శాఖ సమీక్షలో స్పష్టమైంది. ఎఫ్ఆర్ బీఎం(ఫిస్కల్ రెస్పాన్సబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్) చట్టం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం అర్థ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 23,794 కోట్లు రుణం తీసుకోవడానికి అవకాశం ఉందని, ఇప్పటివరకు రూ.16 వేల కోట్లు రుణం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిచంద్ర వివరించారు. మరోవిడత రుణం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందన్నారు. వర్క్ కాంట్రాక్ట్స్ పైన జీఎస్టీ 12 శాతానికి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.600 నుంచి రూ.700 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. రైతు రుణ మాఫీకి రూ.3 వేల కోట్లు, డ్వాక్రా గ్రూపులకు రూ.2 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 
 
ఏపీఐఐసీ, రైతు సాధికార సంస్థ, మహిళా సాధికార సంస్థ, ఇరిగేషన్, వాటర్ రిసోర్సెస్, డ్రింకింగ్ వాటర్, ఏపీయుఐడీసీ, రోడ్ల అభివృద్ధి, పవర్ ఫైనాన్స్... వంటి కార్పోరేషన్లకు రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఆ కార్పోరేషన్లు స్వతంత్రంగా రుణం తీసుకుంటే బ్యాంకులు వడ్డీ ఎక్కువ వసూలు చేస్తాయని, ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే తక్కువ వడ్డీ వసూలు చేస్తాయని, అందువల్ల ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమా మునివెంకటప్ప, ఆడిట్ శాఖ డైరెక్టర్ డి.శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ విజయ కుమారి  తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments