Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కర్ఫ్యూను పొడిగింపు.. మినహాయింపు కూడా..?

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (14:19 IST)
ఏపీలో కర్ఫ్యూను పొడిగించాలని సర్కారు భావిస్తోంది. మే 5 నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వం దశల వారీగా కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న కర్ఫ్యూ ఈ నెల 20తో ముగియనుంది. 
 
గతంలో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో కర్ఫ్యూ సమయాన్ని కుదించనున్నారు. రెండు, మూడు రోజుల్లో సీఎం జగన్‌ నిర్వహించే సమీక్షా సమావేశంలో కర్ఫ్యూ అమల్లో ఇవ్వాల్సిన మినహాయింపులపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. 
 
కరోనా కట్టడి కోసం నెల రోజులకు పైగా అమలు చేస్తున్న కర్ఫ్యూ సత్ఫలితాలు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాన్ని మరికొద్ది రోజులు పొడిగించాలని యోచిస్తోంది. అయితే ప్రస్తుతం ఇస్తున్న సడలింపులకు తోడు మరికొన్ని మినహాయింపులు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తోంది.
 
దీంతో ఈ నెల 21 నుంచి సాయంత్రం 6 గంటల నుంచి మరసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం కర్ఫ్యూను మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు అమలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments