Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస కార్మికులతో పెరుగుతున్న కరోనా కేసులు.. మహిళకు కోవిడ్

Webdunia
మంగళవారం, 12 మే 2020 (15:04 IST)
వలస కార్మికులతో కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వస్తున్న కార్మికుల్లో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. తాజాగా భద్రాచలం జిల్లాలోని మోటకొండూరు మండలం కేంద్రానికి ముంబై నుంచి వచ్చిన ఏడుగురు వలస కార్మికుల్లో ఒక మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా వీరిని ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఫీవర్ హాస్పిటల్‌కు క్వారెంటైన్‌ కోసం పంపించారు. వారికి అక్కడ కరోనా టెస్ట్‌ చేయగా మహిళకు పాజిటివ్ అని తేలిందని మండల వైద్యాధికారి రాజేందర్ నాయక్ తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. చెన్నై నుంచి బయలుదేరిన వలస కార్మికుల శ్రామిక్‌ రైలు శ్రీకాకుళం చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో చెన్నైలో చిక్కుకుపోయిన 889 మంది జిల్లా వాసులు ఈ రైలు ద్వారా శ్రీకాకుళానికి చేరుకున్నారు. వీరిలో 685 మంది మత్స్యకారులు ఉండగా 204 మంది వలస కూలీలు ఉన్నారు. వలస కూలీలందరిని అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించనున్నారు. చెన్నై నుంచి వచ్చిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా 30 బస్సులను ఏర్పాటు చేశారు.
 
మరోవైపు విజయవాడ నగరంలో ఎక్కడా కూడా దుకాణాలు తెరుచుకోలేదు. విజయవాడ నగరం పూర్తిగా రెడ్ జోన్, బఫర్ జోన్స్ ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దుకాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలలో కూడా పాజిటివ్ కేసులు రావడంతో అక్కడ కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కేవలం ఉదయం 6నుంచి 9గంటల వరకు మాత్రమే అధికారులు సడలింపులిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments