ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో జరిపిన పరీక్షల్లో 33 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,051గా ఉందని తెలిపింది.
ప్రస్తుతం ఆసుపత్రుల్లో 949 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,056 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 58 మంది కొవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు, ఇప్పటివరకు 46 మంది కరోనా వల్ల మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 10, తూర్పు గోదావరిలో 1, కృష్ణాలో 4, నెల్లూరులో, కర్నూలు జిల్లాల్లో 9 చొప్పున కేసులు నమోదయ్యాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.
ఇదిలావుంటే జిల్లాల వారీగా కరోనా కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపూరం 115, చిత్తూరు 131, గుంటూరు 387, కడప 97, కృష్ణ 346, కర్నూలు 584, నెల్లూరు 111, ప్రకాశం 63, శ్రీకాకుళం 5, విశాఖపట్టణం 66, విజయనగరం 4, వెస్ట్ గోదావరి 68, ఇతరులు 27 చొప్పున కేసులు నమోదయ్యాయి. కాగా, చిత్తూరు (10), నెల్లూరు (9), తూర్పు గోదావరి (1) జిల్లాల్లో నమోదైన కొత్త కేసులకు మూలం చెన్నై కోయంబేడు మార్కెట్ అని తేలింది.