Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్యం ఆందోళనకరం : వైద్యులు వెల్లడి

Webdunia
ఆదివారం, 21 మే 2023 (10:53 IST)
అనారోగ్యంపాలైన కడప వైకాపా ఎంపి అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి గుండె వైద్య నిపుణులు డాక్టర్ హితేష్ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం చేసిన పరీక్షలో ట్రోపోనిన్ పాజిటివ్ వచ్చిందని.. అది గుండెపోటు వచ్చే అవకాశాన్ని సూచిస్తోందన్నారు. 
 
అందువల్ల యాంజియోగ్రామ్ నిర్వహించగా ఆమెకు రెండు నరాల్లో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. రక్తపోటు తక్కువగా ఉందని, అది సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే ఆమెకు ఎలాంటి వైద్యం అందించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 
 
ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని, మరికొన్ని రోజులపాటు ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. అవినాష్ తల్లి లక్ష్మమ్మ విశ్వభారతి ఆసుపత్రిలో నాలుగో అంతస్తులోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన అయిదో అంతస్తులో ఉండి తల్లి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments