భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయాన్ని ఈ నెల 21వ తేదీన గుంటూరులో ప్రారంభంకానుంది. ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యాలయం ఏర్పాటుకు సమ్మతం తెలిపారు. దీంతో ఈ నెల 21వ తేదీన బీఆర్ఎస్ కార్యాలయంలో ఏపీలో ఏర్పాటుకానుంది.
వాస్తవానికి ఈ కార్యలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. కానీ, అక్కడ అనుకూలమైన స్థలం లభ్యం కాకపోవడంతో ఈ కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేస్తున్నారు.
గంటూరు ఆటో నగర్ వద్దనున్న ఏఎస్ కన్వెన్షన్ హాల్ వెనుక భాగంలో ఐదంతస్తుల భవనాన్ని కార్యాలయం కోసం తీసుకున్నారు. ఇందులోనే పార్టీ సమావేశాలకు రెండు ఫోర్లు, మిగిలిన వాటిలో కార్యాలయ సిబ్బంది, రాష్ట్ర నాయకులకు ప్రత్యేకంగా కేబిన్లు ఏర్పాటు చేస్తున్నారు.
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మూలపురుుడైన సీఎం కేసీఆర్ తన సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితి పేరుగా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే, ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హోదాను ఇంకా ఇవ్వలేదు.