Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

Webdunia
గురువారం, 26 మే 2022 (07:31 IST)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 30వ తేదీ నోటిఫికేషన్ జారీ అవుతుండగా, జూన్ 23న పోలింగ్, జూన్ 26న ఎన్నిక ఫలితాన్ని వెల్లడిస్తారు. 
 
వైకాపా నేత, మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాత్మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెల్సిందే. ఆత్మకూరుతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దేశంలో 3 పార్లమెంట్‌, 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించనున్నారు. 
 
ఇటీవల మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆయన తనయుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. రాజమోహన్‌రెడ్డి పెద్ద కుమారుడైన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో వైసీపీ టికెట్‌ను గౌతమ్‌రెడ్డి భార్యకు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. 
 
అయితే తన రెండో కొడుకు విక్రమ్‌రెడ్డికి ఇవ్వాలని రాజమోహన్‌రెడ్డి ఆయన్ను కోరినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటివరకు ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిపై ఎలాంటి చర్చ జరగలేదు. ఆత్మకూరు నుంచి పోటీ చేస్తామని టీడీపీ ఇప్పటివరకు ప్రకటించలేదు. బీజేపీ మాత్రం తమ అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

హరి హర వీర మల్లు పూర్తి చేయడానికి ఏఎం రత్నం టీమ్ చర్చలు

ఐస్ బాత్ చేస్తూ వీడియోను పంచుకున్న చిరుత హీరోయిన్ నేహా శర్మ (video)

ఆకట్టుకుంటోన్న యావరేజ్ స్టూడెంట్ నాని మోషన్ పోస్టర్

కేసీఆర్‌ లాంచ్ చేసిన కేసీఆర్‌ సినిమాలోని తెలంగాణ తేజం పాట

శ్రీవారిని దర్శించుకున్న డింపుల్ హయాతీ.. బాబోయ్ కాళ్ళు కాలిపోతున్నాయి..

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments