విహార యాత్రలో విషాదం - ప్రముఖ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ మృతి

ఠాగూర్
సోమవారం, 9 జూన్ 2025 (08:49 IST)
హిమాలయ పర్వతారోహణ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ అడుసుమల్లి లక్ష్మణరావు మృతి చెందారు. అనుభవజ్ఞుల బృందంతో కలిసి ఆయన హిమాలయ యాత్రకు వెళ్లినప్పటికీ.. ప్రతికూల వాతావరణం, క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణఆ జిల్లాకు చెందిన లక్ష్మణ రావు తన స్నేహితులు, సహోద్యోగులతో కలిసి హిమాలయ పర్వతారోహణకు వెళ్లారు. సాహస యాత్ర పట్ల అమితమైన ఆసక్తి కలిగిన ఆయన అనుభవజ్ఞులైన పర్వాతారోహకుల బృందంతో కలిసి ఈ యాత్రకు వెళ్లారు. హిమాలయాల్లో అత్యంత కఠినమైన శిఖరాలలో ఒకదానికి అధిరోహిస్తుండగా లక్ష్మణ రావు తీవ్ర అస్వస్థతకు లోనైనట్టు సమాచారం. ఊహించని విధంగా వాతావరణం తీవ్రంగా ప్రతికూలించడంతో పాటు క్లిష్టపరిస్థితులు ఎదురు కావడంతో ఆయన ప్రాణాలు విడిచాడు. 
 
కాగా, అమరావతిలోని లక్ష్మణరావు స్నేహితులు, సహోద్యోగులు మాట్లాడుతూ... మృతుడు తన వృత్తి పట్ల గొప్ప అంకితభావంతో ఉండేవారని, కృష్ణా ప్రాంతంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. డిజైన్, ఇంజనీరింగ్ రంగాల్లో ఆయనకున్న నైపుణ్యం అందరికీ సుపరిచితమేనని, స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణవార్త తెలియగానే ఆర్కిటెక్టర్ రంగ ప్రముఖులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి చెంది సంతాపం తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments