Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కారు

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (14:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సర్కారు శుభవార్త చెప్పింది. చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణం పెండింగ్ బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపారు. ఇందులోభాగంగా, ఈ నెలాఖరులోగా ఈ పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
 
ఇందుకోసం ప్రభుత్వం రూ.3 వేల కోట్ల మేరకు నిధులను మంజూరు చేయనుంది. అలాగే, ఉద్యోగుల జీపీఎఫ్ బిల్లులకు కూడా ఏపీ ఆర్థిక శాఖ క్లియర్ చేయనుందని సమాచారం. ఇదిలావుంటే జగన్ సర్కార్ రైతులకు కూడా తాజాగా శుభవార్త తెలిపింది. రబీ సీజన్‌లో పండించిన పప్పు, ధాన్యాలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం తాజాగా ప్రకటించడం విశేషం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments