ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో అంతుచిక్కని వ్యాధితో పందులు (వానరాలు) మృత్యువాతపడుతున్నాయి. గత వారం రోజుల్లోనే ఏకంగా వెయ్యికిపైగా పందులు చనిపోయారు. అంతుచిక్కని వ్యాధితో చనిపోతుండటంతో పందుల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు.
పెనుగంచిప్రోలులోని స్థానిక తిరుపతమ్మ దేవాలయంలోని దిగువ ప్రాంతంలో కొందరు పందుల్ని పెంచుతున్నారు. వీటిని మునేరు పరిసర ప్రాంతాలవైపు మేతకు వెళుతుంటాయి. అలా వెళ్లిన వానరాలు తిరిగి రావడం లేదు. దీంతో వాటిని వెతికేందుకు పెంపకందారులు పందులు ఎక్కడపడితే అక్కడ చనిపోవడాన్ని గమనించి హతాశులయ్యారు.
దీనిపై వారు స్పందిస్తూ, పందుల మరణం కారణంగా తాము తీవ్రంగా నష్టపోయినట్టు తెలిపారు. ఈ అంతుచిక్కని వ్యాధి బారినపడుతున్న పందులకు మందులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తారు.
అలాగే, పందుల మృతిపై స్థానిక పశువైద్యులు స్పందించారు. చనిపోయిన వానరాల కళేభరాల నుంచి శాంపిల్స్ సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే, చనిపోయిన పందులు కుళ్లిపోయినస్థితికి చేరుకోవడంతో అది సాధ్యంకాలేదు. అదేసమయంలో పందులకు వేసే మేత, నీళ్లలో మార్చాలని పెంపకందారులకు వైద్యులు సూచన చేశారు.