Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు రాష్ట్రాల్లో సాఫీగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Advertiesment
vote
, సోమవారం, 13 మార్చి 2023 (10:55 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో పోలింగ్‌లో భాగంగా, ఏపీలోని శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్టణం, ప్రకాశం - నెల్లూరు - చిత్రూ, కడప - అనంతపురం - కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
 
అలాగే, ప్రకాశం- నెల్లూరు - చిత్తూరు, కడప - అనంతపురం - కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు, వెస్ట్ గోదావరిలో రెండు, శ్రీకాకుళం, కర్నూలలో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు పోలింగ్ సాఫీగా సాగుతోంది.
 
అదేవిధంగా తెలంగాణాలో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ సాగుతోంది. కాగా, ఏపీలో అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన ఐదు స్థానిక సంస్థల నియోజకవర్గ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమైన విషయం తెల్సిందే. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల16వ తేదీన సాయంత్రం వెల్లడిస్తారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం