Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రిలీజైన టెన్త్ ఫలితాలు : బాలికలదే పైచేయి...

వరుణ్
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (11:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. విజయవాడలో సోమవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3746 పరీక్షా కేంద్రాల్లో మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ పబ్లిక్ పరీక్షలను నిర్వహించాు. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 86.69 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 84.32 శాతంగా ఉంటే, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17 శాతంగా ఉంది. ఈ ఫలితాలను ప్రభుత్వం వెబ్ సైట్‌లో చూడొచ్చు. 
 
మూర్ఖుడా... ఏం.. ఒళ్లెలా ఉంది నీకు..? సీఎం జగన్‌కు పవన్ సీరియస్ వార్నింగ్ 
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ చేస్తున్న బస్సు యాత్రలో పవన్ కళ్యాణ్ మాజీ భార్యల గురించి, మూడు పెళ్లిళ్ళ గురించి పదేపదే ప్రస్తావిస్తుండటంతో పవన్‌కు చిర్రెత్తు కొచ్చింది. దీంతో పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలను కలిగివున్న జగన్ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 
 
'ఏం జగన్... నోరు ఎలా ఉంది? మీ అర్థాంగి భారతిగారిని పెళ్లాం అంటే నచ్చుతుందా? జగన్ పెళ్లాం భారతిగారు అంటే నీకు కోపం రాదా? మా వ్యక్తిగత జీవితాల గురించి నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా? నీకు బుద్ధుందా... ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వొక ముఖ్యమంత్రివేనా? అరే... ఎవరి వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉండవు? అందరి సంసారాలు బాగున్నాయా? కుటుంబాలు అన్నాక గొడవలు ఉండవా? భార్యా భర్తల మధ్య సఖ్యత లేకపోతే విడిపోతారు... నా జీవితంలోంచి వెళ్లిపోయిన ఆడబిడ్డల గురించి మాట్లాడుతూ ముగ్గురు పెళ్లాలు ముగ్గురు పెళ్లాలు అంటావు... మూర్ఖుడా...! దిగజారిపోయి మాట్లాడుతున్నావు... ఏం, ఒళ్లెలా ఉంది నీకు? భయపడతాం అనుకుంటున్నావా? జాగ్రత్తగా మాట్లాడు' అంటూ పవన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments