Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 24 दिसंबर 2024
webdunia
Advertiesment

మూర్ఖుడా... ఏం.. ఒళ్లెలా ఉంది నీకు..? జాగ్రత్తగా మాట్లాడు... సీఎం జగన్‌కు పవన్ సీరియస్ వార్నింగ్

pawan kalyan

వరుణ్

, సోమవారం, 22 ఏప్రియల్ 2024 (08:13 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ చేస్తున్న బస్సు యాత్రలో పవన్ కళ్యాణ్ మాజీ భార్యల గురించి, మూడు పెళ్లిళ్ళ గురించి పదేపదే ప్రస్తావిస్తుండటంతో పవన్‌కు చిర్రెత్తు కొచ్చింది. దీంతో పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలను కలిగివున్న జగన్ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 
 
'ఏం జగన్... నోరు ఎలా ఉంది? మీ అర్థాంగి భారతిగారిని పెళ్లాం అంటే నచ్చుతుందా? జగన్ పెళ్లాం భారతిగారు అంటే నీకు కోపం రాదా? మా వ్యక్తిగత జీవితాల గురించి నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా? నీకు బుద్ధుందా... ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వొక ముఖ్యమంత్రివేనా? అరే... ఎవరి వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉండవు? అందరి సంసారాలు బాగున్నాయా? కుటుంబాలు అన్నాక గొడవలు ఉండవా? భార్యా భర్తల మధ్య సఖ్యత లేకపోతే విడిపోతారు... నా జీవితంలోంచి వెళ్లిపోయిన ఆడబిడ్డల గురించి మాట్లాడుతూ ముగ్గురు పెళ్లాలు ముగ్గురు పెళ్లాలు అంటావు... మూర్ఖుడా...! దిగజారిపోయి మాట్లాడుతున్నావు... ఏం, ఒళ్లెలా ఉంది నీకు? భయపడతాం అనుకుంటున్నావా? జాగ్రత్తగా మాట్లాడు' అంటూ పవన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుంభకర్ణుడైనా ఆర్నెల్లే నిద్రపోతాడు.. ఈ జగన్ నాలుగున్నరేళ్లు నిద్రపోయాడు : వైఎస్ షర్మిల