Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రిలో వెన్నెముక సర్జరీలు

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:34 IST)
తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రిలో ఇప్పటివరకు మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు చేస్తుండగా, త్వరలోనే వెన్నెముక ఆపరేషన్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఇకపై బియ్యం, పింఛను కానుక కార్డుదారులందరికీ ఉచితంగా సర్జరీలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అలాగే ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారికి మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు ఉచితంగా చేయాలని, ఇంప్లాంట్స్‌కు మాత్రం రూ.65-రూ.70వేలు చెల్లించాలని నిర్ణయించారు. రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించడానికి కొత్తగా డాక్టర్ల నియామకానికి ఆమోదం తెలిపారు.

ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ వంటి అధునాతన పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. నూతన ఓపీడీ బ్లాక్‌లో నాల్గవ అంతస్తు నిర్మాణానికి రూ.3.5 కోట్లు మంజూరు చేశారు.

దేశంలోని నిపుణులైన ప్రముఖ వైద్యులందరినీ సంప్రదించి, వారికి వీలైన సమయంలో బర్డ్‌కు వచ్చి ఉచితంగా సర్జరీలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. సర్జరీల వెయిటింగ్‌ సమయం తగ్గించడం కోసం కొత్తగా మూడు ఆపరేషన్‌ థియేటర్లను నిర్మించాలన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments