Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

చిత్తూరుజిల్లాలో తగ్గిన కరోనా కేసులు.. తిరుపతిలో పెరిగిన భక్తులు

Advertiesment
corona cases
, మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:38 IST)
చిత్తూరుజిల్లాలో ఆది, సోమవారాల నడుమ 24 గంటల వ్యవధిలో నలుగురికి కరోనా వైరస్‌ సోకినట్టు అధి కారులు గుర్తించారు. దీంతో ఇప్పటి దాకా జిల్లాలో గుర్తించిన కరోనా కేసుల సంఖ్య 89889కు చేరుకుంది.

కాగా సోమవారం ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో 142 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు అధికారులు ప్రకటించారు. కొత్తగా గుర్తించిన నాలుగు కేసులు తిరుపతి, రామసముద్రం, రేణి గుంట, చిన్నగొట్టిగల్లు మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోద య్యాయి.
 
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారిని సోమవారం 54,040 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 27,530 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 19న రథసప్తమి సందర్భంగా టీటీడీ ఆర్జిత సేవలను రద్దు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ పెరిగిన గ్యాస్ ధర