రిచెస్ట్ బెగ్గర్స్... తిరుమలలో ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం...

ఠాగూర్
ఆదివారం, 23 నవంబరు 2025 (09:56 IST)
తిరుమల శ్రీవారి ప్రసాదంపై బుల్లితెర యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేము రిచెస్ట్ బిచ్చగాళ్లం.. తిరుమలలో ప్రసాదం అడుక్కుంటున్నాం అంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆమె దిగివచ్చారు. బహిరంగ క్షమాణలు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. 
 
ఇటీవల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆమె తన భర్త, స్నేహితుడితో కలిసిచేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యూలైన్‌లో వెళ్తున్న సమయంలో తితిదే అందజేస్తున్న ప్రసాదాలపై కామెంట్స్ చేశారు. ప్రసాదాన్ని అడుక్కుంటున్నామని, ఇలా ఎపుడూ అడుక్కోలేదని, ది రిచెస్ట్ బిచ్చగాళ్ళమని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇవి తీవ్ర వివాదాస్పదమయ్యాయి. పరమ పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించడం అడ్డుక్కోవడంలా కనిపిస్తుందా అంటూ శివజ్యోతిపై పలువురు భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె దిగివచ్చారు. 
 
తిరుమలలో అన్నప్రసాదాలపై తాను చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన క్రమంలో శివజ్యోతి శనివారం రాత్రి స్పందిస్తూ ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. నా మాటలు తప్పగా ఉన్నాయి కానీ, నా ఉద్దేశం అది కాదు. రూ.10 వేల టికెట్ కోసం కానీ క్యూలైనులో నిలబడ్డామనే ఉద్దేశంతో అన్నాను. నా తరపున, నా తమ్ముడు సోను తరపున సారీ చెబుతున్నా. 
 
నా జీవితాన్ని మార్చిన స్వామి గురించి తప్పుగా మాట్లాడను. ఆయన దయ లేకుంటే నా జీవితంలో ఏదీ జరిగేది కాదు. నా కడుపులోని బిడ్డ కూడా స్వామి ప్రసాదించిందే. తెలిసో తెలియకో పొరపాటున నా నుంచి, నా తమ్ముడు నోటి నుంచి ఆ మాటలు వచ్చాయి. భక్తులకు, టీటీడీ బోర్డు సభ్యులందరికి క్షమాపణలు చెబుతున్నా. మరోసారి ఇలా జరగదు' అంటూ వీడియో ద్వారా వివరణ ఇస్తూ క్షమాపణలు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments