Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింఛన్ ఇవ్వకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాం... చేతిలో కొడవలితో మహిళ హల్‌చల్

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (09:35 IST)
ఇటీవలికాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై జరిగే భౌతికదాడులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళా తాహసిల్దారుపై ఓ రైతు పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
 
ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కూడేరు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన కొందరు వ్యక్తులు తమకు పింఛన్ ఇవ్వకపోతే పెట్రోల్ పోసి తగులబెడతామని, కొడవలితో నరికి చంపుతామంటూ పంచాయతీ కార్యదర్శిని బెదిరించాడు. 
 
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కూడేరు ఎంపీడీవో కార్యాలయానికి కొందరు పింఛనుదారులు వెళ్లారు. తమకు ఈ నెల పింఛన్ ఎందుకు ఇవ్వలేదంటూ నిలదీశారు. ఈ నెల ఇవ్వడానికి లేదని, వచ్చే నెల నుంచి ఇస్తామని ఆయన సమాధానం ఇచ్చారు. 
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వారు వచ్చే నెల కనుక పింఛన్ రాకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తామని బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని పెన్నోబులేశు, శివమ్మతోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
శివమ్మ కార్యాలయంలోకి వెళ్లిన సమయంలో ఆమె చేతిలో కొడవలి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శివమ్మ కొడవలితో అక్కడికి ఎందుకు వెళ్లిందన్న విషయంపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కార్యదర్శి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments