Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా కోవిడ్ హాస్పిటల్స్ అగ్రస్థానం

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (08:13 IST)
అనంతపురం జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పటిష్టమైన చర్యలు చేపట్టి కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. పాత్రికేయుల సమావేశంలో అనంతపురం జిల్లాలో కరోనా నియంత్రణలో ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశంతో పోలిస్తే ఏ విధంగా మెరుగ్గా ఉన్నామో అంకెల ద్వారా జిల్లా కలెక్టర్ పాత్రికేయులకు వివరించారు. 
 
జిల్లాలో 56,148 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 53403 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని, డిశ్చార్జి  రేటు 95.11 శాతంగా ఉందన్నారు. 2237 యాక్టివ్ కేసులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఆక్టివ్ కేసుల్లో భారతదేశ సగటు 15.85 శాతం కాగా, రాష్ట్ర సగటు 9.60 శాతం ఉందని, అనంతపురం జిల్లాలో 3.79 శాతం కలిగి ఉందన్నారు.

తద్వారా ఎక్కువమంది కోవిడ్  నుండి కోలుకొని క్షేమంగా ఇళ్లకు వెళ్లారన్నారు. దేశం మొత్తం మీద మరణాల  రేటు 1.57 శాతం ఉండగా , రాష్ట్రం మరియు జిల్లా  మరణాల శాతం సగటు 0.84 గా ఉందన్నారు. జిల్లాలో మరణాల శాతాన్ని తగ్గించడానికి అనేక చర్యలు చేపట్టడం జరిగిందని, అందులో  కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ముందుగానే గుర్తించి దాదాపు 10, 000 మందిని  వెంటనే ఆస్పత్రులకు మరియు కోవిద్ కేర్ సెంటర్లకు తరలించడం ద్వారా మరణాల శాతాన్ని తగ్గించగలిగామన్నారు. 

ఇంటింటి సర్వే చేసి, ప్రధానంగా 94 శాతం కన్నా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్న వారిని, శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వారిని, 100 ఫారన్హీట్ డిగ్రీల కన్నా ఎక్కువ జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి  ముందుగానే ఆస్పత్రులకు చేర్చడం వల్ల తక్కువ మరణాలు సంభవించాయన్నారు.
 
జిల్లాలో సెప్టెంబర్ 27 నాటికి 4, 19, 738 పరీక్షలు నిర్వహించామని, తక్కువ పరీక్షల నుండి నెలకు 1, 40, 000 పరీక్షలు నిర్వహించే స్థాయికి ఎదిగామన్నారు. దేశవ్యాప్తంగా సగటు న 10 లక్షల జనాభాకు 52, 000 పరీక్షలు నిర్వహించారని, రాష్ట్రంలో సగటున 10 లక్షల జనాభాకు ఒక లక్ష వరకు పరీక్షలు నిర్వహించారని, మన జిల్లాలో 10 లక్షల జనాభాలో 95000 మంది జనాభాకు పరీక్షలు నిర్వహించామన్నారు.
 
మార్చిలో 280 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా సోకిందని, ఆ మాసంలో పాజిటివిటీ రేటు 0.70 శాతం కాగా, ఏప్రిల్ మాసంలో 5599 మందికి పరీక్షలు నిర్వహించగా 65 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 1.16 శాతం, మే మాసంలో 23,336 మందికి పరీక్షలు నిర్వహించగా 327 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 1.40 శాతం, జూన్ మాసంలో 35, 769 మందికి పరీక్షలు నిర్వహించగా 1687 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 4.72 శాతంగా నమోదైందన్నారు

జూలైమాసంలో 84, 554 మందికి పరీక్షలు నిర్వహించగా 13, 685 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 16.18 శాతం, ఆగస్టు  మాసంలో 1,40, 262 మందికి పరీక్షలు నిర్వహించగా 25, 757 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 18.36 శాతం, సెప్టెంబర్ మాసంలో ఈనాటి వరకు 1, 28, 939 మందికి పరీక్షలు నిర్వహించగా 14, 625 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 11.25 శాతం గా నమోదైందన్నారు.

ఇకనుంచి మరింత ఎక్కువగా టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. మార్చి మాసంలో ఇద్దరి తో ప్రారంభమైన కరోనా కేసులు ఆగస్టు నెలలో అత్యధికంగా 18.36 శాతం పాజిటివిటీ రేటు కాగా,  ఈ నెలలో   గణనీయంగా తగ్గి,  11.25 శాతానికి తగ్గించగలిగా మన్నారు.
 
జిల్లాలోని 12 కోవిడ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న 2, 237 యాక్టివ్ కేసుల్లో, 1114 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 700 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో, 423 మంది హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స పొందుతున్నారు. ఈ హాస్పిటల్ లో 5000 బెడ్ల సామర్థ్యం కలిగివున్నప్పటికీ 20 శాతం బెడ్ లను మాత్రమే వాడుతున్నామన్నారు.

కోడి కేర్ సెంటర్లలో 5, 400 పైచిలుకు బెడ్ల సామర్థ్యం కలిగి ఉండగా, అందులో 700 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండు వారాలుగా 19 కేటగిరీలలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి వాటిని ఆధారంగా పాయింట్లు కేటాయించి ర్యాంకింగ్ లను ప్రకటిస్తోంది అన్నారు. వీటిలో జిల్లాకు రెండు వారాల్లోనూ మొదటి ర్యాంకు  వచ్చిందన్నారు.
 
జిల్లాలో ఆస్పత్రుల్లో  వసతులు, మానవ వనరులు తక్కువ ఉన్నా కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు.
కరోనా లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి వారిని హాస్పిటల్ లకు తరలించడం నుంచి, చికిత్స అందించి డిశ్చార్జ్ చేసేంతవరకు సమర్థవంతంగా చర్యలు చేపట్టడం వలన మరణాల శాతాన్ని తగ్గించగలిగామన్నారు. ఈ అంశంలో లక్షణాలు ఉన్న వారిని  ముందే ఆస్పత్రులలో చేర్పించ లేకపోతే మరణాలు ఎక్కువగా సంభవించడం జరుగుతుందన్నారు.

ఇటీవల  మరణాలు జరిగిన కేసులను విశ్లేషిస్తే, సగటున  14.48 రోజుల్లో  రోగులను ఆసుపత్రుల్లో వైద్యం పొందిన తర్వాత మరణించడం జరిగిందన్నారు.  బాధితులకు వైద్యం అందించడంలో  ప్రయత్న లోపం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో మరణాల రేటులో జిల్లా ఏడో స్థానంలో ఉందన్నారు. ఇందులో 73 శాతం ఇతర రోగ లక్షణాలతో మరణించిన వారు కూడా ఉన్నారని, 27 శాతం మంది రోగ లక్షణాలు లేనివారు చనిపోయారు అన్నారు.
కరోనా కేసులు నమోదులో రాష్ట్ర సగటు 60 రోజుల్లో రెట్టింపు అవుతుంటే, జిల్లాలో 90 రోజుల్లో రెట్టింపు అవుతుందని, కర్నూలు జిల్లాలో 180 రోజులకు కరోనా కేసులు నమోదవుతోందన్నారు.
 
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడమే కాకుండా, వాటిని సక్రమంగా వాడుకుంటూ, భౌతిక దూరాన్ని పాటించడం, తరచూ చేతులను శుభ్రపరచుకోవడం, గాలి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మంది భూమి కూడా కుండా ఉండటం లాంటివి తప్పక పాటించాలన్నారు. కరోనా బారిన పడిన వారు మానసికంగా దృఢత్వం కలిగి ఉండాలని, ధైర్యంగా ఉంటూ కరోనాను ఎదుర్కోవాలి అన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని  గ్రామ , వార్డు సచివాలయ వ్యవస్థలతో పాటు, మీడియా ప్రతినిధులు,  స్వచ్ఛంద సంస్థల సహకారం అందించడం ద్వారా అరికట్ట గలిగా మన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి ఎనిమిది వేల కిట్లను అందిస్తున్నామన్నారు.
 
ఇప్పటివరకు నమోదైన మొత్తం 56 వేల కేసులలో 16, 046 మందికి ఆస్పత్రిలో చికిత్స అందించామన్నారు. దాదాపు పదివేల మందికి కోవిడ్ కేర్ సెంటర్లలో ఉంచి చికిత్స అందించగా, మిగిలిన 30 వేల మందికి హోమ్ ఐసోలేషన్ లో ఉండి రికవరీ అయ్యారన్నారు. ఆరు లక్షల పైచిలుకు ప్రైమరీ సెకండరీ కాంట్రాక్టర్లను గుర్తించి హోమ్ ఐసోలేషన్ లో ఉండమని చెప్పడం జరిగిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments