అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి ఆర్డిటి ఆస్పత్రి నుంచి 36 మంది, అనంతపురంలోని సవీర ఆస్పత్రి నుంచి ఇద్దరు డిశ్చార్జి అయ్యారు.
బత్తలపల్లి ఆర్డిటి ఆస్పత్రి లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఆర్ డి టి డైరెక్టర్ మాంచు ఫెర్రర్ ఆధ్వర్యంలో 36 మంది డిశ్చార్జ్ అయ్యారు.
శుక్రవారం మధ్యాహ్నం జరిగిన డిశ్చార్జి లలో గుజరాత్ కు చెందిన 23 మంది, హిందూపురంకు చెందిన 10 మంది, అనంతపురం చెందిన ముగ్గురు, గుత్తికి చెందిన ఒక ఒకరు, శెట్టూరు కు కింద ఒకరు డిశ్చార్జి అయ్యారు.
ప్రతి ఒక్కరికి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రెండు సార్లు టెస్టింగ్ నిర్వహించగా నెగిటివ్గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రి నుంచి బయటికి వచ్చే సమయంలో చప్పట్లతో డాక్టర్లు, అధికారులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
భారీ సంఖ్యలో ఒకే రోజు 38 మంది డిశ్చార్జి కావడం, ఇప్పటివరకు జిల్లాలో 92 కు డిశ్చార్జి ల సంఖ్య చేరడంతో జిల్లా యంత్రాంగం, డాక్టర్లు, ప్రజలు సంతోషం లో మునిగిపోయారు. కరోనా వైరస్ ను జయించవచ్చనే నమ్మకం ఈరోజు జరిగిన డిశ్చార్జి లతో మరింత పెరిగింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తదుపరి వైద్య సేవల నిమిత్తం డిశ్చార్జ్ అయినవారికి ఒక్కొక్కరికి రూ.2 వేలు చొప్పున నగదును అంద చేశారు. డిశ్చార్జ్ అయిన వారు 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో వుండాలని కలెక్టర్ వారికి సూచించారు.