Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనకాపల్లిలో డ్రోన్ ప్రచారం.. బీజేపీ నేతల దాడిపై సీఎం రమేష్ ఫైర్

సెల్వి
ఆదివారం, 5 మే 2024 (08:52 IST)
భాజపా నేతపై దాడిని ఖండిస్తూ అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి సిఎం రమేష్‌ ఆధ్వర్యంలో శనివారం మాడుగుల మండలం తరువ గ్రామంలో నిరసన చేపట్టారు. మాడుగులలోని కొన్ని గ్రామాల్లో డ్రోన్లతో బీజేపీ నేతలు పార్టీ జెండాలను ఎగురవేశారు. అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మద్దతుదారులు డ్రోన్ ప్రచారాన్ని వ్యతిరేకించారు. ప్రచారాన్ని వ్యతిరేకించడంతో, రెండు పార్టీలు తీవ్ర వాగ్వివాదానికి దిగాయి. ఇది బిజెపి నాయకుడిపై దాడికి దారితీసింది.
 
విషయం తెలుసుకున్న సీఎం రమేష్ గ్రామానికి వచ్చి బీజేపీ నేతకు మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామ వివాదంలో జోక్యం చేసుకోవద్దని రమేష్‌ను హెచ్చరించిన స్థానికులు వెంటనే గ్రామం విడిచి వెళ్లాలని కోరారు. అయితే రమేష్ తన నిరసనను కొనసాగించగా, గ్రామస్తులు కొందరు రమేష్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అతడి చొక్కా చిరిగిపోయింది. 
 
కాగా, పోలీసులు రమేష్‌ను దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తనపై దాడి జరుగుతోందని సీఎం రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు పోలీసులు ఇరువర్గాలకు నోటీసులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments