Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అన్న జగన్ మానసికస్థితి భయంగా ఉంది .. అందుకే అద్దం పంపుతున్నా : వైఎస్ షర్మిల

ఠాగూర్
శనివారం, 4 మే 2024 (17:57 IST)
తన అన్న, వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా తాను ఆడుతున్నానంటూ అన్న జగన్ చేస్తున్న ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు. పైగా, మా అన్న జగన్ మానసికస్థితిని చూస్తే భయమేస్తుందని వ్యాఖ్యానించారు. తన అన్న జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందంట, అందుకే ఆయనకు ఓ అద్దాన్ని పంపుతున్నట్టు చెప్పారు. 
 
ఆమె శనివారం కడపలో విలేకరులతో మాట్లాడుతూ, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో తాను చేతులు కలిపానని, చంద్రబాబు చెప్పినట్టుగా తాను ఆడుతున్నానని, తన రిమోట్ కంట్రోల్ చంద్రబాబు చేతిలో ఉందంటూ జగన్ పదేపదే అంటున్నారని, ఎలాంటి ఆధారాలతో ఇలాంటి ప్రచారం చేస్తారని ఆమె సూటిగా ప్రశ్నించారు. పైగా, చంద్రబాబుతో ఈ వైఎస్ఆర్ బిడ్డ, వైఎస్ఆర్ వారసురాలు చేతులు కలిపిందని నిరూపించగలరా అని ఆమె సవాల్ విసిరారు. 
 
చంద్రబాబు చెబితే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని అంటున్నారు. మరి ఆ నాడు చంద్రబాబు చెబితేనే జగన్ కోసం పాదయాత్ర చేశానా, సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మాట వింటారని చెబుతున్నారు. చంద్రబాబు ఎంతో పవర్ ఫుల్ అని చెబుతున్నారు. ఏం జరిగినా చంద్రబాబే కారణమని అంటున్నారు. జగన్‌‍కు చంద్రబాబు పిచ్చిపట్టుకుంది అని షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments