Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో అద్భుత కట్టడం రాబోతోంది: రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (22:03 IST)
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. సోదరులతో కలిసి శ్రీవారి సేవలో ఆమె పాల్గొన్నారు. ఎంతో సంతోషంగా భక్తులందరినీ పలుకరిస్తూ స్వామివారిని దర్సించుకున్న తరువాత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు ఎపిఐఐసిఛైర్ పర్సన్ రోజా. 
 
తిరుమలలో గతంలో కూల్చివేసిన వెయ్యికాళ్ళమండపం నిర్మాణానికి మళ్ళీ అడుగులు పడుతున్నాయనీ, మండపం నిర్మాణానికి టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి శ్రీకారం చుట్టారని రోజా చెప్పారు. కార్తీక మాసంలో స్వామివారిని దర్సించుకోవడం చాలా సంతోషంగా ఉందన్న రోజా. జగన్మోహన్ రెడ్డి పారదర్సకంగా రాజకీయాలు నడుపుతున్నారని చెప్పారు. 
 
చంద్రబాబునాయుడు జీవితం మొత్తం వెన్నుపోటు, శవ రాజకీయాలకే సరిపోతుందని, తిరుపతి ఎంపి కరోనాతో మృతి చెందితే హడావిడిగా అభ్యర్థిని ప్రకటించి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నసమయంలో 14 సంవత్సరాలు సిఎంగా చేసినందుకు ప్రజలకు భరోసా కూడా కల్పించలేని పరిస్థితి చంద్రబాబుదన్నారు.
 
కరోనా సమయంలో ప్రజల గురించి ఆలోచించకుండా చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కున్నారని.. జగన్ పార్టీ పెట్టినప్పటికీ నుంచి మృతి చెందిన వారి కుటుంబంపై పోటీ పెట్టకుండా ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు తన సామాజిక వర్గం వారిని నిలబెట్టేందుకు లోకల్ బాడీ ఎన్నికల కోసం హడావిడి చేస్తున్నారని.. స్థానిక సంస్థల ఫండ్స్ రాకపోతే రాష్ట్ర అభివృద్థి కుంటు పడుతోందని.. ఎన్నికలు వాయిదా పడేలా చూశారని అన్నారు. 
 
మార్చి లోపల ఎన్నికలు పెడితే అన్ని స్థానాలు గెలుచుకుంటామనే భ్రమలో టిడిపి ఉందని.. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో నెట్టి వెళ్ళిపోయారని విమర్సించారు రోజా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments