Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల ఎస్వీబీసీ చానల్లో అశ్లీల లింక్ కలకలం

Advertiesment
Obscene link
, బుధవారం, 11 నవంబరు 2020 (15:25 IST)
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబధించిన ఎస్వీబీసీ చానెల్లో ఆశ్లీల లింక్ కలకలం రేపింది. ఎంతో పవిత్రతకు నిదర్శనమైన భక్తి చానల్లో ఇలాంటి ఆశ్లీలకరమైన అంశాలు చోటుచేసుకోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ పంపగా అతడికి ఎస్వీబీసీ ఉద్యోగి ఓ పోర్న్ సైట్ వీడియోను పంపడంతో ఈ కలకలం చెలరేగింది.
 
దీంతో ఆ భక్తుడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి, ఈవో జవహర్ రెడ్డిలకు  ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన వారిద్దరు విచారణకు ఆదేశించారు. ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ విజిలెన్స్, సైబర్ క్ర్రైమ్ టీమ్, ఈడీపీ అధికారులు సోదాలు నిర్వహించారు.
 
కార్యాలయయంలో అశ్లీల సైట్లు చూస్తున్న ఉద్యోగులను సైబర్ క్రైమ్ టీం గుర్తించినట్లు తెలిపింది. ఈ ఘటనకు బాధ్యులపై, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ యంత్రాంగం సిద్దం అవుతున్నట్లు తెలిపింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌-చైనాల మధ్య ఒప్పందం.. త్వరలో బలగాల ఉపసంహరణ